సైబర్ క్రిమినల్స్.. దేశవ్యాప్తంగా 23 మందిని అరెస్టు చేసిన టీఎస్ పోలీసులు

-

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో లింకులు పంపిస్తూ, ఓటీపీలు, వీడియో కాల్స్ చేస్తూ సామాన్యుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. వీరి కారణంగా డబ్బులు కోల్పోయిన వారు కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. మరికొందరు మీ పేరిట మాదకద్రవ్యాల పార్సిల్ వచ్చిందని భయపెట్టి, మరికొందరు సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోస్ వైరల్ చేస్తామని బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.

దేశవ్యాప్తంగా సైబర్ కేసులు నమోదువుతున్నాయి. ఒక రోజులో వందల కేసులు నమోదువుతుండగా.. తాజాగా వారి ఆగడాలకు తెలంగాణ పోలీసులు చెక్ పెట్టారు. సైబర్ క్రైమ్ కేసుల్లో కీలక నిందితులను పట్టుకునేందుకు ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తంగా 23 మంది సైబర్ నేరగాళ్లను స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి మీద దేశవ్యాప్తంగా 328 కేసులు, తెలంగాణలోని 30 కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లుగా తేలింది. నిందితుల నుంచి మొబైల్స్, చెక్‌ బుక్స్,సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news