కొంప ముంచేస్తున్న ఫేస్బుక్… లింక్ క్లిక్ చేస్తే అంతే…!

-

లాక్ డౌన్ లో జనాలు తినడానికి తిండి లేక చస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబ పోషణ అనేది ఇప్పుడు చాలా భారంగా మారింది. దాదాపు దేశ౦ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది అనే విషయం అర్ధమవుతుంది. ఇలాంటి తరుణంలో సామాజిక మాధ్యమాలను అదునుగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటున్న జనాలు ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తున్నారు.

సోషల్ మీడియాలో సమయం ఎక్కువగా కేటాయిస్తూ తమకు ఏదోక టైం పాస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే వాళ్లకు శాపం గా మారింది అనేది అర్ధమవుతుంది. ఫేస్బుక్ లో కొన్ని ప్రకటనలు పదే పదే వస్తున్నాయి. వాటిని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే తక్కువకే స్మార్ట్ ఫోన్ వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. అలాగే ది బెస్ట్ బిజినెస్ అని లాక్ డౌన్ ని లక్ష్యంగా చేసుకుని కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు.

వాటిని క్లిక్ చేయడం ఓటీపీ ఎంటర్ చేయడం డబ్బులు పోవడం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి ఈ కేసులు. ఇలా చాలా మంది ఇప్పుడు ఆర్ధికంగా కష్టాలు పడుతున్నారు. అలాగే గూగుల్ పే ఫోన్ పే ని కూడా అదునుగా చేసుకుని ఈ ఆఫర్లు ఇస్తున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. దయచేసి ఏ ప్రకటనలు నమ్మవద్దు అని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version