లాక్ డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు! కొన్ని కంపెనీలు ఉద్యోగాలు తీసేస్తుంటే.. మరికొన్ని కంపెనీలు సగం జీతాలు చెల్లిస్తుంటే.. మరికొన్ని కంపెనీలు అయితే అస్సలు జీతాలే ఇవ్వని పరిస్థితి. ఈ సమయంలో కాస్త నాలుగు రాళ్లు జీతం బ్యాంక్ అకౌంట్ లో కాస్తో కూస్తో ధైర్యంగా పడుతుందంటే అది ప్రభుత్వ ఉద్యోగులకే అని చెప్పాలి! ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో మాత్రం సినిమా హీరో ఎన్టీఆర్ పెద్ద మనసుతో వ్యవహరించారు!
లాక్ డౌన్ నేపథ్యంలో తన ఇంట్లోనూ, ఆఫీసులోనూ పనిచేస్తున్న ఉగ్యోగులకు ముందస్తుగానే జీతాలు చెల్లించేశారట ఎన్టీఆర్. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమవడం.. కార్యాలయాలు అన్నీ మూసేయడంతో తన వద్ద పనిచేస్తున్న అందరి ఉద్యోగులకు ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తారక్ జీతాల్ని చెల్లించేశారట! దీంతో… ఎన్టీఆర్ తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ముందస్తుగా జీతాలు చెల్లించేశారని ఫిల్మ్ నగర్ లో తెగ డిస్కషన్స్ చేసుకుంటున్నారట! అలా ముందుగానే జీతాలు చెల్లించేయడంతోపాటు… ఎప్పుడు ఆర్థిక అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, వారికి సాయం చేస్తానని ప్రామిస్ కూడా చేశారట. దీంతో… కరోనా వైరస్ వల్ల చిన్న చిన్న జీతగాల్లు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కదా అని తారక్ అర్ధం చేసుకున్నారని ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారంట!
ఇదే క్రమంలో… కరోనాతో పోరు కోసం ఎన్టీఆర్ ఇప్పటికే రూ.75 లక్షలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు అందించగా… మిగిలినరూ.25 లక్షలు సినీ కార్మికుల కోసం విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా… బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో పాల్గొని తారక్.. ఇంటిపనులూ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్న జూనియర్… లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుండగా… అన్నీ అనుకూలంగా జరిగితే… ఈ సినిమా 2021 జనవరి లో విడుదల కానుంది!!