త్వరలోనే డియర్‌నెస్ అలవెన్స్ పెంపు.. హొలీ కంటే ముందే గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. అది కూడా హొలీ కంటే ముందే. ఈసారి హోళీ మార్చి 18న వచ్చింది. అంటే మార్చి 18 కంటే ముందే ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గత కొంత కాలం నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలు విడుదల, హౌసింగ్ రెంట్ అలవెన్స్ పెంపు కోసం చూస్తున్నారు.

అయితే డీఏ పెంపు 3 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి విషయంలోకి వస్తే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మరో మూడు శాతం కనుక పెరిగితే మొత్తంగా ఉద్యోగుల డీఏ 34 శాతానికి పెరుగుతుంది.

సెవెంత్ పే కమిషన్ ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని డీఏ పెంపును కేంద్రం చేపడుతుంది. ఇది ఇలా ఉండగా గత ఏడాది జూలై, అక్టోబర్‌లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచారు.
దీంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లు 31 శాతం డీఏ పొందుతున్నారు.

అలానే జూలై 2021లో డియర్‌నెస్ రిలీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం 17 శాతం నుంచి 28 శాతం కి పెంచింది. బేసిక్ వేతనాన్ని ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను లెక్కిస్తారు. అందరికీ డీఏ ఒకేలా ఉండదు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ వేరు వేరుగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version