ఖిలాడీ హీరోయిన్ డింపుల్‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్

-

మాస్ మ‌హారాజా ర‌వితేజా ఖిలాడీ సినిమాతో హీరోయిన్ డింపుల్ హ‌యాతి సూప‌ర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. డింపుల్ ఇంత‌కు ముందు ప‌లు సినిమాల్లో నటించినా.. ఖిలాడీ సినిమాతో ఫేమ్ లోకి వచ్చింది. దీంతో ఈ తెలుగు భామ‌కు వ‌రుస అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. తాజా గా యాక్షన్ స్టార్ హీరో గోపిచంద్ సినిమాలో డింపుల్ హ‌యాతి ఎంపిక అయిన‌ట్టు తెలుస్తుంది. హీరో గోపి చంద్, డైరెక్ట‌ర్ మారుతి కాంబినేషనల్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే.

కాగ ఈ ఇటీవ‌ల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. కాగ ఈ సినిమా త‌ర్వాత హీరో గోపిచంద్.. శ్రీ వాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు. అందుకు సంబంధించిన క‌థ‌కు కూడా ఎంపిక ప్ర‌క్రియా ముగిసింద‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు డింపుల్ హ‌యాతిని చిత్ర బృందం ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. కాగ డింపుల్ గ‌తంలో ప‌లు సినిమాలో న‌టించినా.. వ‌రుణ్ తేజ్ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ సినిమాలో జ‌ర్రా జ‌ర్రా అనే ఐటెం సాంగ్ లో న‌టించి ప్ర‌త్యేక క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతోనే ర‌వితేజా.. ఖిలాడీలో అవ‌కాశం వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version