మోడీకి పెళ్ళాం, పిల్లలు లేరు.. అందుకే ఇలా చేస్తున్నారు – దానం నాగేందర్

-

ప్రధాని మోడి, బండి సంజయ్ లపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి పెళ్ళాం…పిల్లలు లేరు కాబట్టి కుటుంబ పాలన అంటున్నారని అగ్రహించారు. దేశంలో గాడ్సేకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఎక్కువ అయ్యారని మండిపడ్డారు.

బండి సంజయ్ పిచ్చోడు …పిచ్చి తుగ్లక్ అంటూ చురకలు అంటించారు. బండి సంజయ్ ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు. సిఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్తున్నాడని.. కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కేంద్రం ఏమి ఇచ్చిందో….బండి సంజయ్ గుండు గీసుకుని రాసుకోవాలని ఎద్దేవా చేశారు.

ఇది ఇలా ఉండగా నిన్న వికారాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ కేసీఆర్ వారసుడు(ఎర్రబెల్లి దయాకరరావు) ఒకడున్నాడు కదా అని ఫైర్ అయ్యారు. మోడీని విమర్శించే కేసీఆర్ కు సిగ్గుండాలి..తెలంగాణ సీఎం కేసీఆరా…? మోడీనా..? అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version