ప్రేమను ఒప్పుకోలేదని తండ్రినే జైలుకు పంపిన కూతురు.. కారణం తెలిస్తే షాక్

-

తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోకపోతే ఎదిరించి పెళ్లి చేసుకునే వాళ్లని చూసుంటాం. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకునే వారినీ చూసుంటాం. తల్లిదండ్రులను ఎదురించలేక.. తాము ప్రేమించిన వారిని విడిచి బతకలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారి గురించి విని ఉంటాం. కానీ ఓ బాలిక తన ప్రేమను అంగీకరించని తండ్రిని ఏం చేసిందో తెలుసా..?

తన ప్రేమను కాదన్నాడని ఓ బాలిక తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో అయిదున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్ర అంధేరీలోని డీఎన్‌ నగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో జరిగింది.

అసలేమైందంటే.. కుమార్తె ప్రియుడి వెంట తిరగడం ఆ తండ్రికి నచ్చలేదు. హెచ్చరించాడు.. ఆమె బేఖాతరు చేసింది. కోపంతో తండ్రి కొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలిక తనపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 2017లో పాఠశాల టీచరుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. అవి తప్పుడు ఆరోపణలని తెలియని టీచరు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక తండ్రి 2017లో అరెస్టు అయ్యాడు.

పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్యపరీక్షలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడి కాలేదు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో తనను తాకినట్లు అనిపిస్తోందని, పీడకలలు వస్తున్నాయని బాల్యంలోనే ఆమె తన నోట్‌బుక్‌లో రాసుకుంది. బాలిక మానసిక పరిస్థితి బాగోలేక అలా చెప్పిందని తేలింది. దీంతో బాలిక తండ్రిని నిర్దోషిగా తేల్చి, అతని విడుదలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version