కాంగ్రెస్ లోకి దానం నాగేందర్.. క్లారిటీ ఇదే !

-

గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్.. టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆర్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. మంత్రి పదవి ఆశించినా.. భంగం కలిగిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్.. మళ్ళీ స్వంత గూటికే వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన దీనిపై స్పందించారు. మూతి లేదు తోక లేదు అన్నట్టుగా రేవంత్ తీరు ఉందని.. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్స్ విభాగానికి పిర్యాదు చేశానని పేర్కొన్నారు.

చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ ఎస్ తోనే ఉంటానని స్పష్టం చేశారు దానం నాగేందర్. తన ఇంటికి ఎవడు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందేనని పేర్కొన్నారు. కొత్త బిచ్చగాళ్ళు వచ్చి.. సిఎం కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారని.. గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదు.. వాని అబ్బ సొత్తు అసలే కాదని రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. కాంగ్రెస్, బీజేపీ లకు తెలంగాణ లో భవిష్యత్ లేదని.. రేవంత్ కింద ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్లు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు దానం నాగేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version