నేడు గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన ఘనతను స్మరించుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా విశాఖలోని ఉడా చిల్డ్రెన్ ఏరియాలో ప్రభుత్వం జాషువా జయంతి వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. దళితుల సమస్యల కోసం పోరాడుతున్న వారిని స్టేజి మీదకు ఆహ్వానించలేదని ఎస్సీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నిరసనను దిగారు. దళితులకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. దీంతో వారిని మంత్రి సముదాయించారు. నచ్చచెప్పి, స్టేజి మీదకు ఆహ్వానించారు. . దీంతో అక్కడ వివాదం సద్దుమనిగింది. మొత్తానికి గుర్రం జాషుబా 125వ జయంతి సందర్భంగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు చుక్కెదురైంది.