ఏపీలో బీఆర్ఎస్..కేసీఆర్‌తో డేంజర్..!

-

రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యూహాలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. అసలు వ్యూహం పన్ని..చెక్ పడేవరకు ప్రత్యర్ధికి తెలియదు..అది కేసీఆర్ వ్యూహామని. అంటే ఆ స్థాయిలో కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి. ఎలాంటి రాజకీయ పరిస్తితులు తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన ధిట్ట. తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి..ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేశారు.

ఇక కీలక సమయంలో కాంగ్రెస్ పుంజుకుతున్న నేపథ్యంలో..అనూహ్యంగా బీజేపీని టార్గెట్ చేసి..ఆ పార్టీ బలం పెరిగేలా చేశారు. అంటే కాంగ్రెస్-బీజేపీల మధ్య ఓట్లు చీలితే తనకు బెనిఫిట్ అవుతుందనేది కేసీఆర్ ఎత్తుగడ. రాష్ట్రంలో ఎలాగో తనకు ఇబ్బంది లేదని భావించిన కేసీఆర్..ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. భారత్ రాష్ట్ర సమితిగా మార్చి..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే తెలంగాణలోనే కాదు..ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్..తన పట్టు నిరూపించుకోవాలి. అందుకే తెలుగు ప్రజలున్న రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఏపీపై గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపీలు…కేసీఆర్ జాతీయ పార్టీని లైట్ తీసుకున్నారు. అసలు ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్‌పై స్పందించమంటే చంద్రబాబు ఒక నవ్వు నవ్వి వదిలేశారు.

అంటే కేసీఆర్ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. అయితే వాస్తవానికి బీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపడం కష్టమే. ఇప్పటికే వైసీపీ-టీడీపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు. కానీ ఎప్పటికైతే కేసీఆర్‌తో డేంజర్. ఆయన రాజకీయాన్ని ఏ విధంగానైనా తిప్పేస్తారు. తన వ్యూహాలు అర్ధమయ్యేలోపు అన్నీ పనులు అయిపోతాయి..కాబట్టి కేసీఆర్ పార్టీని లైట్ తీసుకోకుండా..ఆ పార్టీపై కూడా ఒక కన్నేసి ఉంచాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version