కర్ణాటక ప్రభుత్వం ప్రైవేటు ఓలా, ఉబర్ , రాపిడో ఆటో సర్వీసుల వారిపై చర్యలకు ఉపక్రమించింది. గత కొన్నిరోజులుగా వీరు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీవో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో.. కర్ణాటక ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై సంచలన నిర్ణయం తీసుకుంది.ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. ప్రభుత్వం ఈ మేరకు గురువారం నోటీసు జారీ చేసింది.
మూడు రోజుల్లో సర్వీసులు ఆపేయాలని ఆదేశాలిచ్చింది.ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచాయని, 2 కిలోమీటర్లకు రూ.100 వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు భారీగా ఫిర్యాదులు చేశారు.దీంతో ప్రభుత్వం వాటికి నోటీసులిచ్చింది. గతంలో కూడా కర్ణాటక రవాణా శాఖ రాష్ట్రంలో సరసమైన ధరల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉబెర్, ఓలాలకు నోటీసు పంపింది. రవాణా అధికారులు రెండు కారు అగ్రిగేటర్లు చట్టవిరుద్ధంగా వినియోగదారులు నుండి సమయం ఆధారిత ఛార్జీలు అదనంగా వాసులు చేస్తున్నాయని ఆరోపించారు.