మీ మోకాళ్లు నల్లగా ఉన్నాయా? ఇలా చేసి చూడండి..!

-

మన శరీరంలో ఎక్కువగా మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉంటాయి. మనం కూడా ముఖం మీద పెట్టినంత శ్రద్ధ పెద్దగా వీటిపైన పెట్టం. అలా అని వదిలేయం. ఈ ప్రదేశాలలో చర్మం మందంగా ఉంటుంది. ఆ కారణంగా మృత చర్మం పొర అలాగే అక్కడ పేరుకుపోతోంది. అలా ఆ ప్రాంతం అంతా అంద వికారంగా తయారవుతుంది. అయితే, ఈ ప్రదేశాలలో ఆయిల్ గ్లేడ్స్ లేనందున..చర్మం త్వరగా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంటుంది.


పాటించాల్సిన చిట్కాలు ఇవే..

పెరుగు నల్లధనాన్ని పోగొడుతుంది. దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం రంగును కాంతివంతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగును మోచేతులు, మోకాళ్లకు అప్లై చేసి.. కొంతసేపు ఉంచి, తర్వాత నీటితో కడగాలి.

కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా మోకాలు, మోచేతుల నలుపు తొలగిపోతుంది. ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వారానికి 2 నుండి 3 రోజులు ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం తొలగిపోతుంది.

నిమ్మకాయ, టామోటా, బేకింక్ సోడాతో కూడా మోకాళ్ల నలుపు పోగొట్టుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో కాస్త నిమ్మరసం వేసి అందులో ఒక టమోటా రసం వేయాలి. టమోట మన శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. టాన్ తొలగించటంలో టామోటా చక్కగా పనిచేస్తుంది. ఇంకా ఒక అరటీస్సూపన్ బేకింక్ సోడా వేసి బాగా కలుపండి. ఆ తర్వాత మోకాళ్లను, మోచేతులు బాగా క్లీన్ చేసుకుని ఒక కాటన్ బాల్ తో మనం తయారుచేసుకున్న ఈ రసాన్ని నల్లగా ఉండే ప్రదేశంపై రాయండి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తూ ఉంటే..మార్పు వస్తుంది. ఫేస్ మీద మాత్రం ఇది రాసుకోకూడదు.

ఏదైనా పేస్ట్( వైట్ కలర్ లో ఉండేది అయితే బెటర్) తీసుకుని, అందులో రెండూ టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోండి. ఇంకా శనగపిండి ఒక టెబుల్ స్పూన్ వేసుకోండి. శనగపిండి పడనివాళ్లు పెసరపిండి అయినా వాడుకోవచ్చు. తర్వాత అందులో మిల్క్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకుంటే..మిల్క్ అయినా తీసుకోవచ్చు. అలోవెరా జెల్ కూడా ఒక స్పూన్ తీసుకోండి. అలోవేరా పడనివాళ్లు..ఆరెంజ్ జెల్, పాపాయ జెల్ వేయండి. లేదంటే ఏమీ వేయకున్నా ప్రాబ్లమ్ లేదు. తేనే పడేవాళ్లు ఒక స్పూన్ వేయాలి. తేనే లేదంటే రోజ్ వాటర్ అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తం ఒక పేస్ట్ లా వస్తుంది. దీనిని మోకాళ్లకు, మోచేతులకు అప్లై చేయండి. ఇంకా చేతులపైనా కూడా ఆప్లై చేసుకోవచ్చు. 20 నిమిషాల వరకూ ఉంచాలి. ఆ తర్వాత వాటర్ చల్లుతూ స్క్రబ్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్ లో అలా రబ్ చేస్తూ ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. ఒక్కసారి చేస్తేనే విజుబుల్ రిజల్ట్ ఉంటుంది. మనకు టైం ఉన్నప్పుడంతా ఇలా చేసుకోవచ్చు.వారానికి రెండు లేదా మూడుసార్లు ట్రే చేస్తూ ఉంటే..మోకాళ్లు, మోచేతులు కూడా తెల్లగా మారిపోతాయి.

గమనిక: పై సమాచారాన్ని బ్యూటీషియన్స్ చెప్పిన వాటి ఆధారంగానే మీకు అందించటం జరిగింది. మీకు వీటిని వాడే సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చినా వాటిని ఉపయోగించటం మానేయగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version