ఒడిశా ఏపీ స‌మ‌స్య‌ల ప‌రీష్క‌రానికి ఇరు రాష్ట్రాల సీఎంల కీలక నిర్ణ‌యం

-

ఒడిశా, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య ఉన్న దీర్ఘ కాలిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తాజా గా భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, న‌వీన్ ప‌ట్నాయక్ ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ స‌మ‌స్య ల‌ను చ‌ర్చ‌ల ద్వారా నే ప‌రిష్కరించు కోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే దీని కోసం ప్ర‌త్యేకంగా ఒక క‌మిటీ ని కూడా నియ‌మించారు. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జాయింట్‌ కమిటీ వేస్తున్న‌ట్టు ముఖ్య మంత్రులు ప్ర‌క‌టించారు.

ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ దృష్టిపెడుతుందని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ ప్రకటించారు. అలాగే ఏపీ సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రెండు తొలిసారిగా ఈ స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌డానికి, పరిష్కరించడానికి అడుగు ముందుకేశామ‌ని అన్నారు. అందు కోసం ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరమ‌ని అన్నారు. ఈ క‌మిటీ స‌మ‌స్య‌ల మూలాల్లోకి వెళ్తుందని విశ్వాసం వ్య‌క్తం చేశారు. అలాగే వాటి వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుంటుందని దీమా వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version