FLASH : పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

-

FLASH : పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హౌస్ అరెస్ట్‌ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలో తాజాగా ఇసుక దుమారం చెలరేగింది. టీఆర్ఎస్ లీడ‌ర్ల‌కు ముడుపులు అందుతున్నాయ‌న్న ఆరోప‌ణల నేపథ్యంలో…పెద్దపల్లి జిల్లాలో ఇసుక దుమారం చెలరేగింది. దీంతో…. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఓదెల‌ టెంపుల్‌లో ప్ర‌మాణం చేయాల‌ని సవాళ్లు కూడా చేసుకున్నారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అటు ఓదెలలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version