జైల్లో ఉన్న సమయంలో నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై ఇటీవల కేసు పెట్టాను అని దస్తగిరి తెలిపారు. గత ప్రభుత్వంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీ స్పందించి న్యాయం చేయాలి. విచారణ లో ఉన్నా విషయాలు బయటికి చెప్పలేం. జైల్లో ఉన్న సమయంలో నా దగ్గరకు ఎవరెవరు వచ్చారు అనే అంశంపై ప్రశ్నించారు. ఈ కేసులో ఏ1చెతన్య రెడ్డి,ఏ2 సూపరింటెండెంట్ ప్రకాష్, ఏ3 డిఎస్పీనాగరాజు, ఏ4ఈశ్వరయ్య ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈ కేసు సవాల్.
జగన్ వివేకా ను చంపించి నారాసుర చరిత్ర అని రాశారు. వివేకా హత్య పై ఎందుకు జగన్ కోర్టు కు పోలేదు. తొందరలో నిజాలు బయటికి వస్తాయి. ఈ ప్రభుత్వం లో నాకు న్యాయం జరుగుతుందని బావిస్తున్నా. టిడిపి పెద్దలు అందరు ఈ కేసుపై దృష్టి పెట్ఠారు. ఈ కేసుకు ఎండ్ కార్డ్ పడుతుంది అని దస్తగిరి ధీమా వ్యక్తం చేసారు.