విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ వైదిక కమిటీ భవానీ మండల దీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆలయ కమిటీ ప్రకటించిన ప్రకారం.. నవంబర్ 25 నుంచి జనవరి 9వ తేదీ వరకు భవానీ మండల దీక్ష తేదీలను ప్రకటించింది ఆలయ వైదిక కమిటీ. పూర్తి మండల దీక్ష ఉండే భక్తులు వచ్చె నెల 25 నుంచి 30 వరకు మాల ధరించ వచ్చని.. అర్ధ మండల దీక్ష ధరించి వారు డిసెంబర్ 15 నుంచి 19 లోగా మాలధారణ వేసుకోవాలని తెలిపారు. డిసెంబర్ 29న మార్గశిర పూర్ణిమ రోజున కలశ జ్యోతి ఊరేగింపు నిర్వహించనున్నారు. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మాలధారణ విరమణ రోజులుగా నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని భవాని భక్తులు తప్పని సరిగా ఆన్ లైన్ లోనే టికెట్లు తీసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.
భవానీ దీక్షల కార్యక్రమాలు ఇలా..
– నవంబర్ 25 నుంచి జనవరి 9 వరకు భవానీ మండల దీక్ష – పూర్తి మండల దీక్ష ధరించే వారికి నవంబర్ 25 నుంచి 30 వరకు మాలధారణ –
– అర్ధ మండల దీక్ష ధరించే వారికి డిసెంబర్ 15 నుంచి 19 వరకు మాలధారణ
– – డిసెంబర్ 29న మార్గశిర పూర్ణిమ రోజున కలశజ్యోతి ఊరేగింపు –
– జనవరి 5 నుంచి 9వరకు మాలధారణ విరమణ
-శ్రీ