ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయ్. ఈ మెగా క్రెకెట్‌లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు వార్నర్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నయా రికార్డును లిఖించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ ఐదువేల ఐపీఎల్ పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ఈ మార్కు చేరిన తొలి విదేశీ ఆటగాడిగా వార్నర్ రికార్డు నమోదు చేశాడు.
అదే సమయంలో వేగవంతంగా ఐదువేల ఐపీఎల్ పరుగులు సాధించిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి 157 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగులు సాధించాడు. ఆ రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఐదువేల పరుగులు సాధించిన నాల్గో బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఐదువేల పరుగులు సాధించిన విదేశీ ఆటగాళ్లలో వార్నర్ ప్రస్తుతానికి ఒక్కడే. ఆ మార్కును చేరడానికి మరో విదేశీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ లైన్‌లో ఉన్నాడు.