పచ్చళ్లు, పిండివంటల వ్యాపారంలోకి మాజీ ఎమ్మెల్యే…!

-

ఇన్నాళ్లు రాజకీయాల్లో తిరిగిన ఆయన పచ్చళ్లు, పిండివంటల వ్యాపారంలోకి దిగారు. అప్పుడెప్పుడో ఎమ్మెల్యేగా, YS హయాంలో RTC చైర్మన్‌గా పనిచేశారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు. మాజీ ఎమ్మెల్యేగా వచ్చే పింఛన్‌ తప్ప మరే ఆదాయం లేక ఆయన ఇప్పుడు పచ్చళ్ల తయారీ.. అమ్మకాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.


గోనె ప్రకాష్‌రావు. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైనా విశ్లేషకుడిగా మారి కొత్త ప్రయాణం ప్రారంభించారు. తర్వాత సమాచార హక్కు చట్టం కింద పిటిషన్లు సంధించి ప్రభుత్వాలను, అధికారులను పరుగులు పెట్టించారు. చెమటలు పట్టించారు. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. రాజకీయాలు ఇక తన ఒంటికి పడవని అనుకున్నారో లేక.. జీవిత సత్యం తెలుసుకున్నారో కానీ.. పచ్చళ్లు, పిండివంటల వ్యాపారంలోకి దిగారు. అంతేకాదు అలా తాను అమ్మె పచ్చళ్లు, పిండివంటలను విదేశాలకు సైతం ఎగుమతి చేయడానికి కొరియర్‌ సర్వీస్‌ పెట్టేశారు.

ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా వచ్చే పింఛన్‌ తప్ప గోనె ప్రకాష్‌రావుకు మరో ఆర్థిక భరోసా లేదు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో కొన్నాళ్లు ఉన్నారు. అమెరికాలో ఉండే ఆయన స్నేహితులకు గోనె అంటే ఎంతో అభిమానం. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే ఆయనకు ఆర్థికసాయం చేస్తారని అంటారు. అలా ఎల్లకాలం ఒకరిమీద ఆధారపడటం బాగోదని అనుకున్నారో ఏమో.. సొంత వ్యాపారం తెరిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version