కేరళ గోల్డ్ స్కామ్‌: NIA నివేదికలో సంచలన విషయాలు…!

-

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు తవ్వినకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుతో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబందించి పలువురిని అరెస్ట్ చేసిన NIA అధికారులు .. గోల్డ్ లింక్స్‌పై విచారించారు. ఆ విచారణకు సంబంధించి నివేదికను ప్రత్యేక న్యాయస్థానానికి.. NIA అధికారులు సమర్పించారు. ఇందులో కీలక అంశాలను ప్రస్తావించారు అధికారులు.

1993 వరుస పేలుళ్లతో ముంబైను గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్‌ దావూద్‌ పేరును.. ఈకేసులో NIA అధికారులు ప్రస్తావించారు. ప్రదాన నిందితునికి, దావూద్‌తో సంబంధాలున్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. అంటే ఈ గోల్డ్ నిధులు.. దావూద్ ఖాతాలోకి చేరుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దికాలం నుంచి అండర్‌వరల్డ్ మాఫియా ముంబైతో పాటు దేశం బయటపడుతోందని.. మాఫియా కార్యకలాపాలు తగ్గాయని అందరూ భావిస్తున్న సమయంలో.. NIA నివేదికతో ప్రకంపనలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version