కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి బీజేపీలో చేరుతున్న సమయంలో సినీనటి కుష్బూ నోరు జారారు. మానసిక వికలాంగుల పార్టీ నుంచి తాను నిష్క్రమించానని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలతో కుష్బూ.. చిక్కుల్లో పడ్డారు.
మానసిక వికలాంగుల పార్టీ నుంచి బయటకొచ్చానన్న కుష్బూ వ్యాఖ్యలపై.. దివ్యాంగులు భగ్గుమంటున్నారు. గడిచిన రెండురోజులుగా ఆమె పై తమిళనాడులో 70కి పైగా కేసులు నమోదయ్యాయి. కుష్బూ వ్యాఖ్యలు వికలాంగులను అవమానపరిచేలా ఉన్నాయని.. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఖండించింది. మరోవైపు.. ఈవ్యాఖ్యలపై కుష్బూ క్షమాపణ కోరారు.
గడిచిన రెండు రోజులుగా కుష్బూపై తమిళనాడులోని వివిధ పోలీస్ స్టేషన్లలో 70కి పైగా కేసులు నమోదయ్యాయి. కుష్బూ వ్యాఖ్యలు తమను అవమాన పరిచేలా ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్లలో దివ్యాంగులు కేసులు పెడుతున్నారు.చెన్నై, కాంచీపురం, చెంగల్ పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ తదితర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో అధికంగా కేసులు నమోదయ్యాయి.కుష్బూ వ్యాఖ్యలను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక.. తీవ్రంగా ఖండించింది…దీంతో కుష్బూ క్షమాపణలు చెప్పారు.