పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్లు దమ్ములేపారు. 116 పరుగుల టార్గెట్ ను ఛేధించడానికి ఆకాశమే హద్దుగా చేలరేగారు. 10.3 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేశాడు. ప్రథ్వీ షా(20 బంతుల్లో 41) 7 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. అలాగే డేవిడ్ వార్నర్ ( 30 బంతుల్లో 60 నాటౌట్) 10 ఫోర్లు, 1 సిక్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 83 పరుగులు జోడీంచారు. తర్వాత సర్పరాజ్ ఖాన్ (12 నాటౌట్ ) గా నిలిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌ రౌండర్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహార్ ఒక్క వికెట్ తీశాడు. దీనికి ముందు పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఢిల్లీ బౌలర్లు విరుచుకుపడ్డారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. ముస్థఫీజర్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. దీంతో పంజాబ్ 115 పరుగులకే ఆలౌట్ అయింది. కాగ ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.