గత కొన్ని రోజులుగా కరోనా రెండు వేరు వేరు వ్యాక్సిన్లను కలిపితే ఎలా ఉంటుందన్న చర్చ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కూడా. ఐతే ప్రస్తుతం ఆ పరిశోధనలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు లైవ్ హిందుస్తాన్ ప్రచురించింది. కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను కలిపి పరిశోధన చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుండి అనుమతులు లభించినట్లు లైవ్ హిందుస్తాన్ ప్రచురించింది.
ఇక్కడ ప్రతిపాదించిన ట్రయల్స్ లో మొత్తం 300మందికి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. రెండు వేరు వేరు డోసులకి వేరు వేరు వ్యాక్సిన్లకి బదులుగా ఒకే డోసులో రెండు వ్యాక్సిన్లను కలిపే ప్రయత్నం చేయనున్నారు. ఈ విధంగా ఇవ్వవచ్చో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఒకానొక వ్యక్తికి అనుకోకుండా రెండు వ్యాక్సున్లు కలవడం జరిగింది. దీనివల్ల ఆ వ్యక్తిలో రోగనిరోధక శక్తి మరింత మెరుగుపడిందని వెల్లడైందని ఐసీఎమ్ఆర్ తెలిపింది.