సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కి అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకి ఎన్నో నకిలీ వార్తలు మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుందా..? ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకి బ్యాడ్ న్యూస్ చెప్పిందా..? అయితే ఇందులో నిజం ఎంత అనే విషయానికి వస్తే…
ఒమీక్రాన్ నేపథ్యంలో డియర్నెస్ అలోవేన్స్ చెల్లింపులను వాయిదా వేసింది అని ఉంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ పోస్ట్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కనుక ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మదు.
అనవసరంగా ఇలాంటి వార్తలని షేర్ చేయొద్దు. డియర్ నెస్ అలవెన్స్ ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 2021 అక్టోబర్ నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచింది. దీంతో 28 శాతం కాస్త 31 శాతానికి వచ్చింది అయితే వచ్చిన నకిలీ వార్తని నమ్మి అనవసరంగా ఇబ్బందులు పడకండి. ఇది కేవలం నకిలీ వద్ద మాత్రమే.
సోషల్ మీడియాలో రోజు రోజుకీ ఇలాంటి వార్తలు. ప్రభుత్వం స్కీమ్స్ మొదలు ఎన్నో విషయాలపై నకిలీ వార్తలు ఈరోజుల్లో ఎక్కువైపోతున్నాయి అటువంటి వార్తలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పైగా ఏ వార్త అయినా సరే నిజమా అబద్దమా అనేది తెలియకుండా అనవసరంగా షేర్ చేయడం మంచిది కాదు.