డిసెంబర్‌ 25 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – 25 – శుక్రవారం – మార్గశిరమాసం.

మేష రాశి:తగాదాలకు దూరంగా ఉంటె మంచిది !

ఈరోజు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ఈరోజు డబ్బు వసూలు పనులు పూర్తవుతాయి. మీరు ఈరోజు ఏ పనిని పూర్తి చేయాలనుకుంటే అది అవ్వకపోవచ్చు. ఈరోజు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటె మంచిది. ఈరోజు మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఈరోజు ఎవరికీ ఎలాంటి వాగ్దానాలను ఇవ్వకండి. మీరు చేయాలనుకున్న మంచి వలన కొంత ప్రయోజనాన్ని పొందుతారు.

పరిహారాలుః సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించండి, మీ జీవితాన్ని మెరుగు పరుస్తుంది.

 

todays horoscope

వృషభ రాశి:ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది !

ఈరోజు గృహ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు ఇచ్చే దృఢమైన సలహాలు పనిచేస్తాయి.ఈరోజు పనుల్లో పురోగతి. ఈరోజు ఇంటాబయటా అనుకూలత. పోటీపరీక్షల్లో విజయం. మీకు ఈరోజు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఈరోజు మంచి అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. శుభవార్తలు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు పనిలో అదనపు భారం పడుతుంది.

పరిహారాలుః ఇష్టదేవత, కులదేవతను ఆరాధించండి.

 

మిధున రాశి:శుభవార్తలు వింటారు !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణపు భారం పడే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన వ్యక్తిని కలుస్తారు. ఈరోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. ఈరోజు అదనపు బాధ్యతలు కలిసొస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఈరోజు ఇబందులు ఎదురైనా, ఓర్చుకుంటారు. రాబోయే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది.

పరిహారాలుః శ్రీసూక్తం లేదా కనకధార పారాయణం చేయండి.

 

కర్కాటక రాశి:ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు వివాదాలకు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు సోదరులతో విభేదాలు. మీరు మీ చుట్టూ ఉన్న అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మీ చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకోండి. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు మీకు వచ్చిన అవకాశాలు మీకు హాని కలిగించే ప్రమాదం ఉంది.

పరిహారాలుః  శ్రీశివనామాన్ని జపించండి.

 

సింహ రాశి:ఈరోజు బంధువులతో వివాదాలు !

ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. ఈరోజు ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఇంట్లో గొడవ జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేయాలనుకున్న పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఈరోజు బంధువులతో వివాదాలు. ఈరోజు కుటుంబం, బంధువుల గురించి కొంత ఆందోళన చెందుతారు. సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

పరిహారాలుః  శివాభిషేకం చేయంచండి. దీనివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కన్య రాశి:ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది !

ఈరోజు ఆలోచించి అడుగు వేయండి.ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు ధనం విలువ బాగా తెలుసుకుంటారు.

పరిహారాలు: సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి శ్రీసదాశివ ఆరాధన చేయండి.

 

తుల రాశి:ఈరోజు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి !

ఈరోజు ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు.ఈరోజు మీకు ఇష్టమైన వారు కలత చెందుతారు. అయితే, మీ పరిస్థితిని వారికి వివరించి సర్దిచెప్పుకోవాల్సి ఉంటుంది. దైవదర్శనాలు. ఈరోజు బంధువులతో వివాదాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు.

పరిహారాలుః సూర్యారాధన చేయండి.

 

వృశ్చికం రాశి:ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది !

ఈరోజు మీరు కొత్త ఉద్యోగం చేయాలనుకున్న, వ్యాపారం ప్రారంభించాలనుకున్న మీ చుట్టూ ఉన్న వ్యక్తుల సాయం తీసుకోండి. అది మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు.ఈరోజు కుటుంబంలో శుభకార్యాలు. ఈరోజు సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మీ స్థాయిలో మీరు ఏమి చేయాలో అది సకాలంలో పూర్తి చేయాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

పరిహారాలుః గొప్ప ఆర్థిక స్థితికి శ్రీలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి.

 

ధనుస్సు రాశి:ఈరోజు బంధువులతో మాటపట్టింపులు !

ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఈరోజు గందరగోళానికి గురి కాకండి. ఈరోజు తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు చేయవద్దు. ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు బంధువులతో మాటపట్టింపులు. కుటుంబసభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

పరిహారాలుః ”ఓం బుధాయ నమహా మంత్రాన్ని” 101 సార్లు జపించండి.

 

మకర రాశి:ఈరోజు వివాదాలు తీరతాయి !

ఈరోజు ఉద్యోగయత్నాలు సానుకూలం. ఈరోజు సమస్యలు కొంత పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. మీరు గతంలో అనుకున్న సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ఇది తగిన సమయం. ఈరోజు సోదరులతో వివాదాలు తీరతాయి. వాహన యోగం.

పరిహారాలుః  శ్రీపురుషసూక్తం పారాయణం చేయండి.

 

కుంభ రాశి:ఈరోజు మీ దినచర్యలో కొత్త మార్పులు !

ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.చాలా కాలం తరువాత, మీ దైనందిన జీవితం మారబోతోంది. ఈరోజు మీ దినచర్యలో కొత్త మార్పులు కనిపిస్తాయి. మీకు కొత్త స్థానం వస్తుంది. దానిని అంగీకరించండి. ఈరోజు కుటుంబంలో శుభవార్తలు. ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం. ఈరోజు పదోన్నతులు మీ ఇంటి గడపకు వస్తాయి. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. యత్నకార్యసిద్ధి. వాహన, గృహయోగాలు.

పరిహారాలుః ఓం నమో భగవతే వాసుదేవయ 108 సార్లు పఠించండి.

 

మీన రాశి:ఈరోజు రుణాలు చేస్తారు !

ఈరోజు మీరు చేసే పని పట్ల ఏకాగ్రత ఉంచి జాగ్రత్తగా చేయండి. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. ఈరోజు వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఈరోజు ఉద్యోగులకు పనిభారం. ఈరోజు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.ఆవేశంలో మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఏదైనా ఒప్పందానికి మీరు కనెక్ట్ అయితే అదృష్టం కలిగే అవకాశం ఉంది.

పరిహారాలుః అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం సూర్యాష్టకం చదవండి. సూర్యనమస్కారాలు చేయండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version