హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల్లో గల చెట్లను పెద్ద ఎత్తున ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.దీంతో అందులోని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మొన్నటివరకు పచ్చనిచెట్ల మధ్య సంచరించిన వన్యప్రాణులు ఇప్పుడు చదును చేసిన భూముల్లో తన ప్రాణాలను రక్షించుకోలేకపోతున్నాయి.
తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక జింక మరణించింది. కుక్కల దాడులలో జింక చనిపోయిందంటూ హెచ్‌సీయూ విద్యార్థులు వీడియోలు విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే జింక చనిపోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
HCU భూములలో కుక్కల దాడులలో జింక చనిపోయింది అంటూ వీడియోలు విడుదల చేసిన HCU విద్యార్థులు #SaveHCUBioDiversity #Hyderabad #Telangana #Tnews pic.twitter.com/RDOzN8IlLa
— TNews Telugu (@TNewsTelugu) April 4, 2025