ఏపీలోని మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పార్వతీపురంలో అడవి ప్రాంతం నుంచి సంచరిస్తూ ఒక్కసారిగా జనసముదాయం వైపు ఏనుగుల గుంపు రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
నెమ్మదిగా ఊర్లలో నుంచి రోడ్డు మీదకు వచ్చిన ఏనుగుల గుంపు చింతపండు లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకుంది. అనంతరం అద్దాలు ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు తోటి వాహనదారులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.