టోక్యో ఒలంపిక్స్: సెమీస్ పోరులో భజరంగ్ పునియా ఓటమి

-

టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా… జోరుకు బ్రేక్ పడింది. ఇవాళ జరిగిన టోక్యో ఒలంపిక్స్ సెమీస్ పోరులో… భారత రెజ్లర్ భజరంగ్ పునియా ఘోరంగా నిరాశపరిచాడు. 65 కిలోల విభాగంలో రెజ్లర్ భజరంగ్ పునియా పరాజయం పాలయ్యాడు.

అలియోవు చేతిలో 5-12 తేడాతో రెజ్లర్ భజరంగ్ పునియా ఓటమిపాలయ్యాడు ఈ ఓటమితో రెజ్లర్ భజరంగ్ పునియా ఇక కాంస్యం కోసం తలపడనున్నారు. ఇక ఈ కాంస్యం కోసం జరిగే మ్యాచ్ రేపు జరుగనుంది. ఈ మ్యాచ్ లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా గెలిస్తే.. కాంస్యం రావడం ఖాయం. కాగా ప్రిక్వార్టర్స్‌ లో కజక్‌ స్థాన్‌ కు చెందిన ఆక్మత్‌ అలీని 3-3 తేడాతో ఓడించాడు రెజ్లర్‌ భజరంగ్‌ పునియా. వీరిద్దరి మధ్య పోరు ఫైనల్‌ ను తలపించింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.  చివరల్లో ఒక దఫాలో భజరంగ్‌ పునియా ఒకేసారి 2 పాయింట్లు సాధించి.. విజయ కేతనం ఎగురవేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version