బుర్రకో బుద్ది.. జివ్వాకో రుచి అని పెద్దలు ఊరకే అనలేదు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆవును నిజమే అనిపిస్తుంది. తనకు ఎలాంటి వరుడు కావాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని జెండా చౌక్ సమీపంలో నివసించే బంగాలీ దుర్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
అయితే, తనకు తగ్గ వరుడిని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది. ఆపై ఓ పెళ్లి వేడుకలో గోడలపైనా ఆ ప్రకటన అంటించింది. దీంతో ఆ వేడుకకు హాజరైన వారి దృష్టి దానిపై పడింది. ఆ ప్రకటనలో తను ఎలాంటి అబ్బాయి కావాలో చక్కగా వివరించింది. అబద్ధాలు చెప్పే అలవాటు లేనివాడు, పసినిగొట్టులా వ్యవహరించనివాడు ఏ కులానికి చెందిన వాడైనా తనను సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే కాస్తంత చురుగ్గా ఉంటే సరిపోతుందని, తనకంటే చిన్నవాడైనా పర్వాలేదని పేర్కొంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తనను సంప్రదించవచ్చంటూ రెండు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది. ఇప్పుడీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.