మొన్నటి వరకు ఫ్రీగా అందించిన గూగుల్ ఫోటోస్.. కొన్ని నిబంధనలతో ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే, తాజాగా గూగుల్ ఫోటోస్‌కు ప్రత్యామ్నాయంగా ‘డెగో’ వచ్చేసింది. దీంతో ఉచితంగా 100 జీబీ వరకు స్టోరేజీ అందించనుంది. ప్రస్తుతం యూజర్లందరూ గూగుల్ ఫోటోస్‌కు ప్రత్యామ్నాయ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు చూస్తున్నారు. అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది డెగో. ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్ జూన్ 1 నుంచి తమ ‘గూగుల్ ఫోటోస్’ సర్వీసులను కొనసాగించేందుకు ప్రీమియం ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. 15జీబీ వరకు ఉచితంగా వాడుకునే అవకాశం ఉండగా, మరింత క్లౌడ్ స్టోరేజిని కోరుకునే వినియోగదారులు ఫీజు చెల్లించాల్సిందేని తెలిపింది.
డెగో అన్ని స్మార్ట్‌ఫోన్లలో సులభంగా పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం, తన వినియోగదారుల కోసం మూడు స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తుంది. 100 జీబీ వరకు ఉచితంగా స్టోరేజ్ అందిస్తోంది. ఈ ఉచిత ప్యాకేజీలో ప్రతి రిఫరల్ ద్వారా 5 జీబీ బోనస్ వస్తుంది. ఇలా మొత్తం 500 జీబీ స్టోరేజీ పొందవచ్చు. మీ ఫోటోలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయి. ఇక, ప్రో ప్యాకేజి విషయానికి వస్తే.. దీని కింద 500 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ప్రతి రిఫరల్‌కు 10 జీబీ బోనస్ లభిస్తుంది. అయితే ఈ ప్యాకేజీ కోసం ప్రతినెలా 3 డాలర్లు చెల్లించాలి.
మరొకటి అల్టిమేట్ ప్యాకేజీ ..ఇది 10 టీబీ స్టోరేజ్ లభిస్తుంది. ప్రతి రిఫరల్‌కు 10 జీబీ బోనస్, ఇలా మొత్తం 1 టీబీ బోనస్ పొందవచ్చు. ఈ ప్యాకేజీ కోసం ప్రతినెలా 9.99 డాలర్లు చెల్లించాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలను స్టోరేజ్ చేసుకోవడానికి అనేక ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఉచిత ప్యాకేజీలతో డేటా భద్రతపై కొన్ని అనుమానాలున్నాయి. అందుకే కొద్దిపాటి ఫీజు చెల్లించి ప్యాకేజీలను ఎంపిక చేసుకోవడం మంచిది. అందువల్ల, గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌ను పెంచుకోవడం ఉత్తమ ఎంపిక. గూగుల్ ఫోటోస్ కోసం నెలకు కేవలం రూ. 130 చెల్లించి 100 జీబీ స్టోరేజ్ స్పేస్ వాడుకోవచ్చు. ఒకవేళ, 2 టీబీ స్టోరేజ్ కావాలనుకుంటే నెలకు రూ .650 ఖర్చు అవుతుంది. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీకు యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ కూడా లభిస్తుంది.