తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్..ఉద్యోగాల భర్తీలో జాప్యం !

-

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రభుత్వ శాఖల్లో కొత్త కొలువుల భర్తీ ఆలస్యం కానుంది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుతో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగ కేటాయింపుల్లో మార్పులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ సాగుతోంది.

ఇప్పటికే పావు వంతు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. మిగతా ఉద్యోగాలకు సంబంధించి.. అనుమతుల జారీ వేగవంతం అయింది. అయితే.. ప్రస్తుతం ఆరుశాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు అక్టోబర్‌ 1 వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నోటిఫికేషన్ల దశలో ఉన్న పలు ఉద్యోగాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. బ్రేక్‌ పడినట్లైంది. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version