ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం జరిగింది. ఒక్క రోజు వ్యవధిలో రెండుసార్లు జగన్ ఢిల్లీ వెళ్లడం జరిగింది. మొదటిసారి ప్రధాని మోడీ తో భేటీ అయిన జగన్ దాదాపు గంటకు పైగానే రాష్ట్రంలో సమస్యల గురించి ఇంకా అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఇంకా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు జగన్.
ఈ సందర్భంగా శాసన మండలి రద్దు కు కేంద్రం ఒప్పుకున్నట్లు తాజాగా పార్లమెంటు లో జరగబోయే సమావేశాలలో శాసన మండలి రద్దు బిల్లు ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైసిపి నాయకులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు చేస్తే ఎదురయ్యే పర్యవసానాలను సమస్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకు వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్సీలు రెడీ అయ్యారు.
అంతేకాకుండా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు మరియు అదే విధంగా మూడు రాజధానులు గురించి ఇంకా సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటంతో వైసీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహారిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లి జగన్ మీద కంప్లైంట్ చేద్దాము అని బయలుదేరిన సమయంలో ఢిల్లీ పెద్దల నుండి ఊహించని షాక్ తగిలిందట. మేటర్ లోకి వెళితే టీడీపీ ఎమ్మెల్సీలకు ఎంత ట్రై చేసినా కానీ అప్పయింట్ మెంట్ లు దొరకడం లేదు అన్న వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.