ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు( ఎంసీడీ) ఎన్నికలను సకాలంలో నిర్వహించి బీజేపీ గెలిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకంటామని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ… ఢిల్లీలోని చిన్న పార్టీ ఆప్ ను చూసి భయపడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలో మున్సిప్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ వాయిదా వేయడం అంటే… భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన అమరవీరుల త్యాగాలను అవమానపరచడమే అంటూ కేజ్రీవాల్ ట్విట్ చేశారు.