ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు…కేటీఆర్ ఫైర్

-

రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్ ధర్నాకు దిగారు. గత 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఇలాంటి చర్యలకు దిగడం తగదని కేటీఆర్ మండిపడ్డారు.

మరోవైపు …కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ నేతల మీద కేసు నమోదు అయింది. కాకతీయ కళాతోరణం దగ్గర నిన్న నిరసన వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.. ఈ నేపథ్యంలోనే వరంగల్ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయింది.ఆందోళన చేయడం కోడ్ ఉల్లంఘనే అంటున్నది ఈసీ.ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు మిల్స్ కాలనీ పోలీసులు.

.

Read more RELATED
Recommended to you

Exit mobile version