నిమ్స్ డీన్ ని రీకాల్ చేయాలంటూ ఆందోళన

-

 

ఆయన డీన్ గా కొనసాగితే నిరవధిక సమ్మె చేస్తాం..

ఇటీవలే నిమ్స్ డీన్ గా నియామకం పొందిన ప్రొఫెసర్ ఆర్వీ కుమార్ ను వెంటనే రీకాల్ చేయాలంటూ నిమ్స్  రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం నిమ్స్ పాత భవనం ఎదుట డాక్టర్లు ప్లకార్డులతో నిరసనకు దిగారు. గతంలో ఓ వైద్య విద్యార్థి నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై ఆయన్ని ఏసీబీ విచారించింది..అలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని డీన్ గా నియమించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన డీన్ గా కొనసాగితే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.  ఈ రోజు ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో నిమ్స్ అధ్యాపక అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అసీమా శర్మ పాల్గొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version