కెప్టెన్సీ కి బాబర్ ఆజామ్ గుడ్ బై ?

-

పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఈ వరల్డ్ కప్ లో చాలా పేలవంగా ఉంది అని చెప్పాలి. అంచనాలకు తగినట్లు పాకిస్తాన్ రాణించి ఉంటే ఈ పాటికి సెమీస్ లో స్థానం పదిలంగా ఉండేది. కానీ ఇప్పుడు సెమీస్ చేరడం చాలా కఠినం అయిపోయింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడమే సెమీస్ కు దారి. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శనకు ప్రధాన కారణం మరియు పూర్తి బాధ్యత జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ దే. ఎప్పుడైతే ఇండియాతో మ్యాచ్ ఓడిపోయారో అప్పటి నుండే బాబర్ పై ఒక స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకే పాకిస్తాన్ మరియు ఇతర జట్ల మాజీ క్రికెట్ ప్లేయర్స్ నుండి బాబర్ కెప్టెన్సీ నుండి దిగిపోవాలంటూ డిమాండ్ లు వస్తున్నాయి. ఇక తాజాగా ఇంగ్లాండ్ మ్యాచ్ కు ముందు పెట్టిన ప్రెస్ మీటింగ్ లోనూ బాబర్ కు విలేఖరుల నుండి ఈ ప్రశ్న వచ్చిందట.

అయితే ఇందుకు బాబర్ టోర్నీ ముగిసిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అంటూ బదులిచ్చాడు. అయితే పాక్ కనుక సెమీస్ కు చేరకపోతే కచ్చితంగా వన్ డే కెప్టెన్సీ నుండి దిగిపోతాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version