రాష్ట్రంలో మరో అన్నదాతల ప్రాణాలు తీసుకున్నాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన రైతు ఓ కేసు విషయంలో పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు.
ఆ రైతు మీద కేసుపెట్టిన వాళ్ళు పోలీస్ స్టేషన్‌లోనే అన్నదాతను ఇష్టం వచ్చినట్లు దూషించినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు తన పరువు పోయిందని భావించి పురుగుల మందు తాగాడు.అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోస్టుమార్టం కోసం ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినా పోలీసులు స్పందించకపోవడంతో రైతు మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.