గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా జీవిత ఖైదు విధిస్తూ పంచకులలోని సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. డేరాబాబాతో సహా మరో నలుగురికి శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే 2002 సంవత్సరంలో డేరా సచ్ఛా సౌదాలో మేనేజర్ గా పనిచేసే రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై లేఖలు రాశారనే అనుమానంతో రంజిత్ సింగ్ ను దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనపై కోర్టు 2003లో సీబీఐ విచారణకు ఆదేశించింది.
డేరా బాబాకు జీవిత ఖైదు.. హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
-