ఎట్టకేలకు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటున్నట్టు వార్త బయటకు రావడంతో టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.తిరుపతిలో ఎవరూ ఉండటానికి ఇష్టపడరు అంటూ గతంలో సీఎం జగన్ మాట్లాడిన వీడియో ప్రదర్శించిన దేవినేని, బీహార్ తో తిరుపతిని జగన్ పోల్చాడని అన్నారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా సీఎం జగన్ బయటకు వచ్చి ప్రచారం చేయక్కర్లేదు అని వైసీపీ మంత్రులు ప్రకటించారని కానీ వాళ్ళ అహంకారం దిగింది.. అందుకే జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నాడని అన్నారు. తిరుపతిపై అహంకార వ్యాఖ్యలతో దెబ్బతో ప్రజలు ఎదురు తిరుగుతారు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో జగన్ ప్రచారానికి వస్తున్నాడని ఆయన అన్నారు. ఏడుగురు మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినా వైసీపీకి పెద్దగా ప్రయోజనం లేదని పేర్కొన్న ఉమా మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అనేక దౌర్జన్యాలు చేసిందని విమర్శించారు.