ఏపీలో హోంగార్డులకు త్వరలోనే శుభవార్త చెప్పండి ఉన్నామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో హోంగార్డుల అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వేతనాల పెంపు ప్రమాద భీమా పెంపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు హోంగార్డుల ఆరోగ్య రక్షణ కోసం ఆరోగ్యశ్రీ తో ఒప్పందం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు మంది హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి అని సవంగ్ పేర్కొన్నారు. నిన్న రాష్ట్ర హోంగార్డుల 58వ దినోత్సవం సందర్భంగా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ ఈ మేరకు కామెంట్స్ చేశారు. హోంగార్డుల వేతనాలు రూ.21, 300కు పెంచామని.. ఆరోగ్య సంరక్షణతోపాటు, ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.30 లక్షల బీమా అందేలా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు.