ఏపీలో ఆలయాల దాడులకు సంబంధించి ఏపీ డీజీపీ సంచలన నిజాలు బయట పెట్టారు. కొన్ని రాజకీయ పార్టీలు ఆలయాలపై దాడులను దుష్ప్రచారం చేస్తున్నాయన్న ఆయన 9 కేసుల్లో పలువురు రాజకీయ పార్టీల నేతలు నేరుగా ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఇందులో 15 మందిని ఇప్పటికె అరెస్టు చేసామన్న ఆయన దీన్ని బట్టి ఇది ప్రణాళిక ప్రకారమే అసత్య ప్రచారం చేస్తున్నట్టు అర్థం అవుతోందని అన్నారు. కొందరు సోషల్ మీడియా, సైబర్ క్రైం, డిజిటల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
ఆలయాలపై దాడులకు సంబంధించి పోస్టులు పెడుతున్న ఫాస్టర్ వ్యవహారంపై సీఐడీ విచారణ చేస్తోందని అన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టామని అన్నారు. దుష్ప్రచారం చేస్తే పోస్టులను ఫార్వార్డ్ చేసే వారిపై కూడా చర్యలు ఉంటాయని అన్నారు. ఏపీలో ఆలయాలపై దాడుల్లో నేరుగా ప్రమేయం ఉన్న 17 మంది టీడీపీ నేతలు ఉంటే అందులో 13 మందిని అరెస్ట్ చేసామని అన్నారు. అలానే బీజేపీ నేతల్లో 4 మంది ఉండగా అందులో ఇద్దరిని అరెస్టు చేసామని ఆయన అన్నారు. ఆలయాల దాడుల్లో పాత్ర ఉండి పరారీలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు.