టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి చెందిన క్రికెట్ అకాడమీని హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు పల్లవి విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో శని వారం జరిగిన ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. ముఖ్య అతిధిగా వచ్చారు. దిగ్గజ క్రికెర్ మహేంద్ర సింగ్ ధోనికి చెందిన క్రికెట్ అకాడమీ హైదరాబాద్ లో ప్రారంభిస్తుండటం గొప్ప విషయమని మల్లారెడ్డి పేర్కొన్నారు.
మంత్రి సమక్షంలోనే ఎంఎస్‌డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లంవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమురయ్య, మిహిర్ దివాకర్ లు మార్చుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఎంఎస్‌డీపీఏ ఏర్పాటుకు చొరవ తీసుకున్న కొమురయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఎంఎస్‌డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్ లో ధోని లాంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి పేర్కొన్నారు.