గత ఐపీఎల్ లోనే ధోనీ నాకు హింట్ ఇచ్చారు: గైక్వాడ్

-

అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తప్పకున్న మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గానూ అదే విధంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత సంవత్సరమే మహీ భాయ్ నాకు కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చారు అని అన్నారు.

సిద్ధంగా ఉండు.. నీకిది సర్ప్రైజ్ ఉండకూడదు అని చెప్పారు. నేను క్యాంప్లో జాయిన్ అయినప్పుడు మ్యాచ్ ప్రణాళికలపై సూచనలు చేశారు అని తెలిపారు. కెప్టెన్ చేయాలని ఆయన ముందే అనుకున్నారు. కానీ, ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారం క్రితం నాతో చెప్పారు’ అని వెల్లడించారు. ఇదిలా ఉంటే… మరి కాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version