టీం ఇండియాలో మాజీ కెప్టెన్ ధోని తర్వాత మిడిల్ ఆర్డర్ లో అతని పాత్రను ఎవరు పోషిస్తారు అనే దానిపై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ న్యూజిలాండ్ చేతిలో ఓడినప్పటి నుండి ధోని ఆడలేదు. దానికి తోడు యువ ఆటగాడు రిషబ్ పంత్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనితో ధోని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానంలో మనీష్ పాండేకు భారత్ కి దొరికాడని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన తర్వాత “హిందూస్తాన్ కో అఖిర్ ధోని కా రీప్లేస్‌మెంట్ మిల్ గయా” అంటూ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. భారత్ కు చివరికి ధోని స్థానంలో మనీష్ పాండేలో మంచి ఫిట్ గా ఉన్నాడు.
అదే విధంగా శ్రేయాస్ అయ్యర్ కూడా పూర్తి ఆటగాడిగా కనిపిస్తాడని, వీరు భారత బ్యాటింగ్ కి ప్రధాన బలం అని అక్తర్ వ్యాఖ్యానించాడు. “ఈ ఆటగాళ్ళు ఐపిఎల్‌లో చాలా ఆడారు, ఒత్తిడిని ఎలా మ్యానేజ్ చెయ్యాలో వారికి తెలుసు, వారు పెద్దగా తమకు వచ్చే గొప్ప పేరు గురించి పట్టించుకోరు, అందువల్ల ముఖ్యమైన ఇన్నింగ్స్ లు ఆడతారని అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇండియా ఆస్ట్రేలియా సీరీస్ లో పాండే ఫీల్డింగ్ లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.