ఈ సీజన్లో ధోనీ కొన్ని మ్యాచ్లు ఆడరు : క్రిస్ గేల్

-

అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తప్పకున్న మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గానూ అదే విధంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు కెప్టెన్సీ పగ్గాలు రుతురాజ్ గైక్వాడ్ కి అందజేశాడు. పేరుకే ఋతురాజు గైక్వాడ్ చెన్నై టీం కి కెప్టెన్ . వెనుక నుండి మాత్రం నడిపించేది మహేంద్రసింగ్ ధోని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిల్ లను చెన్నైకి అందించాడు.

వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో మ్యాచ్లో చురుగ్గా కనిపించిన ఎంఎస్ ధోనీ ఈ ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చని మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ తెలిపారు. ‘ఈ సీజన్లో కెప్టెన్ కూల్ బహుశా అన్ని మ్యాచ్లు ఆడరు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే నాయకత్వ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించారు అని పేర్కొన్నారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు. దీని గురించి చింతించకండి’ అని గేల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version