లక్కంటే ఆ రైతుదే… రాత్రికిరాత్రి లక్షాధికారిని చేసిన వజ్రం.

-

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు.. ఒక్కోసారి దరిద్రున్ని ఉన్న పలంగా ధనవంతుడిని చేస్తుంది. లాటరీ టికెట్లు కొన్న సాధారణ ప్రజలు.. ఒక్కోసారి అదృష్టం వరించి కోటీశ్వరులు అవడం మనం చాలా సార్లు వినే ఉన్నాం. లక్ష్మీ దేవి కరుణిస్తే సాధారణ మనిషి కూడా రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అవుతుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ పన్నా ప్రాంతంలో జరిగింది.

ప్రపంచంలో కెల్లా అత్యంత ఆకర్షనీయమైన, నాణ్యమైన వర్షాలు దొరికే ప్రదేశంగా మధ్య ప్రదేశ్ లోని పన్నా గనులకు పేరుంది. ఈ ప్రాంతంలో గనుల్లో తాజాగా ములాయం  సింగ్ అనే రైతు కూలీకి విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కృష్ణ కల్యాణ్​పుర్ పట్టి గనిలో కార్మికులు జరుపుతున్న తవ్వకాల్లో రూ.60లక్షలు విలువ చేసే 13.54 క్యారెట్ల వజ్రాయం ములాయం చేతికి చిక్కింది. దీంతోపాటే మరో ఆరు చిన్న వజ్రాలు ములాయంతోపాటు తవ్వకాలు జరుపుతున్న సహ  కార్మికులకు దొరికాయి. ఒకే రోజులో 7 వజ్రాలు దొరకడంతో అక్కడ అధికారులను డైమండ్ డేగా పిలుస్తున్నారు. దొరికిన 7 వజ్రాల విలువ దాదాపుగా రూ. కోటి ఉంటుందని అంచానా వేస్తున్నారు అధికారులు. వీటిని వేలం వేస్తే అసలు విలువ తెలుస్తుందంటున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ వచ్చే డబ్బులతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని.. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటానంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version