ఎమ్మెల్సీ ఆశ: ఖమ్మంలో ఛాన్స్ ఎవరికి? తుమ్మలకు క్లారిటీ వచ్చినట్లేనా?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ సీట్ల లొల్లి నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యే కోటాలో 6, స్థానిక సంస్థల కోటాలో 12, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉంది. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధులు దాదాపు ఖరారైపోయారు. ఇక ఈ లిస్ట్‌లో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పేరు లేదు. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఏదైనా పదవి దక్కుతుందా? అని ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మంది ఆశావాహులు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు.

అయితే స్థానిక సంస్థల కోటాలో ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానం మాత్రమే ఉంది. అంటే ఖమ్మంలో ఒక్కరికే అవకాశం దక్కనుంది. మరి ఆ ఒక్క సీటు తుమ్మలకు ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఖమ్మం ఎంపీ సీటు త్యాగం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఈయనకే కాదు ఇంకా పలువురు నేతలు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.

బాలసాని లక్ష్మీనారాయణ, తాతా మధు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, దిండిగల రాజేందర్, తుళ్లూరి బ్రహ్మయ్య, స్వర్ణకూమారి, వద్దిరాజు రవిచంద్రలు ఆశావాహుల లిస్ట్‌లో ఉన్నారు. అంటే ఎంతమంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నారో చూసుకోవచ్చు. అయితే ఉన్న ఒక్క సీటుని కేసీఆర్‌కు ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు.

అయితే తుమ్మలకు ఇచ్చే విషయంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే…నెక్స్ట్ పాలేరు టిక్కెట్ దొరకడం అంత సులువు కాదు. అక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ దక్కకపోతే ఖచ్చితంగా తుమ్మలకు పాలేరు సీటు ఇవ్వాలి. లేదంటే ఆయన టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వడంలో వెనుకాడరని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తుమ్మలకు బాగా క్లారిటీ వస్తుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version