ఉల్లితొక్కలను ఇలా వాడితే ఇమ్యునిటీ పవర్‌ దెబ్బకు పెరుగుతుంది తెలుసా..?

-

ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఉండదు.. ఒక్క మనిషి శవం తప్ప. మనం వండుకూనే కూరగాయలు తొక్క తీసి అందరూ పడేస్తుంటారు. కానీ తొక్కలోనే ఉంది అసలు మ్యాటర్. కొడిగుడ్డు పెంకు నుంచి ఉల్లిపాయ తొక్క వరకూ అన్నీ పనికొచ్చేవే. చాలా మంది ఉల్లిపాయ తొక్కలు తీసి చెత్త బుట్టలో వేసేస్తారు.మహా అంటే ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటే.. వాటికి వేస్తుంటారు. కానీ ఉల్లిపాయ మాదిరిగానే వాటి తొక్కలు కూడా పోషకాలు కలిగి ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

ఉల్లిపాయ తొక్కల్ని ప్రత్యేకమైన సువాసన కలిగిన ఉల్లిపాయ ఇన్ఫ్యూజ్డ్ వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. వెనిగర్ ఉన్న బాటిల్‌లో ఉల్లిపాయ తొక్కలు వేసేసి గట్టిగా మూత పెట్టేయాలి. కొన్ని వారాల పాటు దాన్ని కదిలించకుండా అలాగే ఉంచండి. ఈ వెనిగర్‌ని సలాడ్ డ్రెస్సింగ్, మెరినేడ్ లో వాడుకోవచ్చు.

ఉల్లిపాయ తొక్క టీ సంప్రదాయ వైద్యంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఉల్లిపాయ తొక్కలని వేడి నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత వాటిని వడకట్టుకుని తాగేయడమే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్, ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ నరాలకు విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్ర అందిస్తుంది.

ఉల్లిపాయ తొక్కలో సపోనిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని చూర్ణం చేసి నీటితో కలిపినప్పుడు అది కొద్దిగా సబ్బుగా మారుతుంది. ఈ మిశ్రమంతో పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు. సహజంగా శుభ్రపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి.

ఉల్లిపాయను జుట్టుకు వాడుతుంటారు. ఉల్లితొక్కను కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కల కషాయాలని హెయిర్ రిన్స్‌గా వాడుకోవచ్చు. ఈ తొక్కలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టుని ప్రకాశవంతం చేయడంలో సహాయపడతాయి. వీటిలో సల్ఫర్ ఉంటుంది. దీన్ని తలకి పట్టిస్తే తెల్ల జుట్టు నుంచి బయట పడొచ్చు. ఉల్లిపాయ తొక్కలు స్టవ్ మీద పెట్టి నల్లగా అయ్యేంత వరకు వేడి చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కలబంద జెల్ లేదా నూనె కలుపుకుని హెయిర్ డై మాదిరిగా జుట్టుకి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version