తలా తోక లేని కేసులో చంద్రబాబు అరెస్ట్: ఎంపీ రామ్మోహన్ నాయుడు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు వైసీపీ పై మరియు జగన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నిధులను గోల్ మాల్ చేశారన్న కేసులో తగిన ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసినట్లుగా సిఐడి తెలిపింది. కాగా తాజాగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించాడు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ ను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కేసులో అస్సలు అర్థమే లేదు.. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ జరిగిందని… ఇది ఒక తలా తోక లేని కేసుగా రామ్మోహన్ నాయుడు చెప్పారు.

చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ నేతలు రాక్షస ఆనందం పొందుతున్నారు అంటూ కామెంట్ చేశారు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రాన్ని సరిగా పాలించడం చేతకాని జగన్ తన స్వార్థం కోసం లండన్ వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాడని మాట్లాడారు ఎంపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version