ఈ యాంకర్ వల్లే ఆ స్టార్ డైరెక్టర్ పెళ్లి జరిగిందని మీకు తెలుసా..?

-

సాధారణంగా ఎవరైనా సరే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు . అలాంటి సమయంలో స్నేహితుల సహాయంతో ఆ ప్రేమికులు ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదే తంతు సినీ ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక అలాంటి వారిలో పూరి జగన్నాథ్, లావణ్య ప్రేమ పెళ్లి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఆకాష్ పూరి తాజాగా నటించిన చోర్ బజార్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అందులో పూరి జగన్నాథ్ లావణ్య కు అన్యాయం చేస్తున్నాడు అంటూ ఛార్మి ని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి.

ఇక పూరి జగన్నాథ్ తను ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి.. తాళి కొనడానికి కూడా డబ్బులు లేని సందర్భంలో లావణ్య పూరిజగన్నాథ్ ను నమ్మి వచ్చిందని, అలాంటి మహోన్నత వ్యక్తికి పూరిజగన్నాథ్ అన్యాయం చేస్తున్నాడు అంటూ పెద్దఎత్తున బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ప్రేమ, పెళ్లి ఇలా అన్ని విషయాలు కూడా బయట చర్చనీయాంశంగా మారడం గమనార్హం. ఇకపోతే కుటుంబ సభ్యులను ఎదిరించి పూరి జగన్నాథ్ లావణ్య వివాహం చేసుకునేటప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదట .కానీ ఆ యాంకర్ వల్ల వీరి వివాహం జరిగిందని సమాచారం.

ప్రముఖ యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు తీసుకొచ్చి పూరి జగన్నాథ్ లావణ్య ల పెళ్లికి కారణమైంది.. ఇక ప్రముఖ నటి హేమ కూడా వీళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు తీసుకు వచ్చారు.

మరి కొంతమంది స్నేహితులు కూల్డ్రింక్స్ , పెళ్లి భోజనాలు ఏర్పాటు చేశారని సమాచారం. అలా ఇంత మంది సన్నిహితులు ప్రోత్సాహంతో పూరి జగన్నాథ్ లావణ్య ను వివాహం చేసుకున్నాడు . కష్టాల్లో కూడా తోడు వుండి భర్త కు అండగా నిలిచిన లావణ్యను బండ్లగణేష్ సీతాదేవితో పోల్చడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version