2 మార్చి 1949 న గుండెపోటు కారణంగా చనిపోయారు.. ఎన్నో సేవలని అందించిన ”సరోజినీ నాయుడు” ని ఒకసారి గుర్తు చేసుకుందాం..!

-

సరోజినీ నాయుడు గురించి తెలియని వారు ఉండరు. భారత కోకిలగా ప్రసిద్ధి చెందారు సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు. అలానే ఒక మంచి కవయిత్రి కూడా. ఈతరం వారు కూడా ఆమె గురించి తప్పక తెలుసుకోవాలి. ఆమె నిజంగా చాలా మందికి ఆదర్శం.

సరోజినీ నాయుడు జననం, బాల్యం:

హైదరాబాద్ లోని అఘోరేనాథ్ ఛటోపాధ్యాయ మరియు వరద సుందరి దేవి కి 13 ఫిబ్రవరి 1879 వ సంవత్సరంలో సరోజినీ నాయుడు జన్మించారు. అఘోరేనాథ్ ఛటోపాధ్యాయ మరియు వరద సుందరి దేవి కి మొత్తం ఎనిమిది మంది పిల్లలున్నారు. సరోజినీ అందరికంటే పెద్దవారు. వీళ్ళు బెంగాల్ కు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాళ్లు.

సరోజినీ నాయుడు తల్లిదండ్రుల వివరాలు:

సరోజినీ నాయుడు తండ్రి డాక్టరేట్ ని స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం లో పూర్తి చేసారు. నిజాం కాలేజీ లో ప్రిన్సిపాల్ గా పని చేసేవారు. ఈమె తల్లి బెంగాలీ భాషలో కవిత్వాలు రాసేవారు.

సరోజినీ నాయుడు విద్యాబ్యాసం:

12 సంవత్సరాల వయస్సులో మెట్రిక్యులేషన్ పూర్తి చేసారు. హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్ షిప్ కూడా వచ్చింది. ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో చదివారు.

రాజకీయ జీవితం :

25 సంవత్సరాల వయస్సులో ఒక మంచి వక్తగా ఈమె పేరు తెచ్చుకున్నారు.
ఎక్కువగా ఈమె మహిళల హక్కుల కోసం మాట్లాడుతూ ఉండేవారు.
అలానే ఈమె కష్టాలలో ఉన్న వారిని ఆదుకునేవాడు కూడా.
కైసరే హింద్ మెడల్ ని ఆమె చేసిన సామజిక సేవకు గాను 1911 వ సంవత్సరంలో పొందారు.
ముత్తులక్ష్మి రెడ్డి అనే సంఘ సంస్కర్త తో ఈమెకి 1909 సంవత్సరంలో పరిచయం ఏర్పడింది. వారితో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ని ప్రారంభించారు.
1914 లో సరోజినీ నాయుడు మహాత్మా గాంధీని కలుసుకున్నారు.
అన్నీ బిసెంట్ తో కలిసి జాతి, మత మరియు డబ్బు భేదాలు లేకుండా ఓటు హక్కు ప్రతీ ఒక్కరికీ కూడా ఉండాలని పోరాటం చేసారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ మహిళ ప్రెసిడెంట్ అయ్యారు కూడా.
1917 లో ఈమె సత్యాగ్రహం లో కూడా పాల్గొన్నారు.
ఈమె స్వాతంత్ర పోరాట సమర యోధులు అయిన గాంధీజీ, గోపాల్ కృష్ణ గోఖ్లే, రాబిన్ద్ర నాథ్ టాగోర్, సరళా దేవి తో పని చేసారు.
1927 లో అఖిల భారత మహిళా సదస్సు ని ప్రారంభించారు.
1930 లో ఉప్పు సత్యాగ్రహం లో మహిళలు పాల్గొన వద్దని చెప్పినా కూడా ఆమె పాల్గొన్నారు. గాంధీజీ గారు అరెస్ట్ అయ్యాక ఆమెని నాయకురాలిగా నియమించారు.
స్వాతంత్రం వచ్చాక ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఎంపికయ్యారు.

కవయిత్రిగా…

1905 లో ద గోల్డెన్ త్రెషోల్డ్ (Teh Gloden Threshold)
1912 లో Teh Bird of Time: Songs of Life, Death & teh Spring
1917 లో Teh Broken Wing and Teh Song of teh Palanquin Bearers వ్రాసారు.

మరణం:

మార్చి 1న తలనొప్పి తో బాధపడ్డారు. తరవాత దగ్గుతూ ఆమె కుప్ప కూలిపోయారు. నర్సు ని ఆమె పాట పాడమని దాన్ని వింటూ ఆమె నిద్రపోయారు. 2 మార్చి 1949 న గుండెపోటు కారణంగా లక్నో లో ప్రభుత్వ భవనం లో కన్ను మూసారు.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version